మండపేట పురపాలక సంఘం పరిధిలోని 15 నుండి 22 వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు. బిపిఎస్ గ్రాండ్ రూ 1. 54 కోట్లతో16 రోడ్లు, డ్రైన్ లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మాజీ చైర్‌పర్సన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, కమిషనర్ టి. వి. రంగారావు, డి. ఈ, కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.