మండపేట: 'బస్టాండ్ లో ఆక్రమణలను తొలగించండి'

79చూసినవారు
మండపేట: 'బస్టాండ్ లో ఆక్రమణలను తొలగించండి'
మండపేట బస్టాండ్ లో ఆక్రమణలను తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ బీజేపీ నేతలు సోమవారం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. బస్టాండు ఆక్రమణకు గురై ప్రయాణికులు కూర్చోడానికి గాని, నిలబడటానికి గానీ లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆయా ఆక్రమణలను తొలగించాలని, ప్రయాణికుల కోసం నిర్మించిన బస్ షెల్టర్ లక్ష్యం నీరుగారిపోతున్న దన్నారు.

సంబంధిత పోస్ట్