ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. మండపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా కానీ కనీసం 10 శాతం హామీలు కూడా కూటమి నాయకులు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు.