రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపు మాపి, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మండపేట నియోజకవర్గం చెల్లూరులో శనివారం చిన్న సూక్ష్మ మధ్యతరగతి (ఎం ఎస్ ఎం ఈ) ద్వారా ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు.