వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మండపేటలో శనివారం మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని పేర్కొన్నారు. పార్టీ లక్ష్యాల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.