మండపేట: పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా తోట

82చూసినవారు
మండపేట: పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా తోట
వైఎస్సార్సీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కమిటీలో చోటు కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రతి క్షణం కృషి చేస్తానని ఆదివారం మీడియాతో తోట తెలిపారు.

సంబంధిత పోస్ట్