మండపేట మండలం ఏడిద పంచాయతీ పరిధిలోని దేవుడు చేను కాలనీలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం అయ్యాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలి, భారీ శబ్ధంతో మంటలు పైకి లేచాయి. ప్రజలు ఆ శబ్ధానికి భయబ్రాంతులకు గురి అయ్యారు. ఈ ఇంటికి సంబంధించిన నివాసితులు కూలీ పనులకు వెళ్లారు. ప్రమాదం ఎలా జరింగిందనేది తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.