ఎమ్మెల్యేను కలిసిన ముస్లిం సోదరులు

79చూసినవారు
మండపేట పట్టణ జామియా మస్జిద్, ఆమీనా మస్జిద్, అక్సా మస్జిద్, హంజా మస్జిద్ ఇమాములు, కమిటీ సభ్యులు, జమాత్, ముస్లిం సోదరులు శుక్రవారం మండపేట టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేగుళ్ళను పూలమాలలతో, దుశ్శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు అల్లాను ప్రార్ధిస్తూ ఎమ్మెల్యే వేగుళ్ల సారధ్యంలో నియోజకవర్గానికి మంచి జరగాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

సంబంధిత పోస్ట్