కొంకుదురులో ఉన్న శ్రీ శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిర 7వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ధ్యాన మందిర వార్షికోత్సవంలో విశాఖపట్నంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీ కిరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ధ్యాన ప్రాముఖ్యతను గూర్చి వివరించారు. కీ. శే. గొలుగూరి భాస్కర్ రెడ్డి, సుశీల దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.