వల్లూరు పెద్ద చెరువు గట్టు పై అక్రమ నిర్మాణాల తొలగింపు..

68చూసినవారు
కపిలేశ్వరపురం మండలం, వల్లూరు గ్రామంలోని పెద్ద చెరువు గట్టుపై అక్రమంగా నిర్మించిన ఇళ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం పంచాయతీ అధికారులు జేసీబీల సహాయంతో 20 ఇళ్లను కూల్చివేశారు. ఎంపిడిఒ రత్నకుమారి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఆక్రమణదారులకు పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో చర్యలు చేపట్టారు. చెరువు గట్టు పై నిర్మాణాలు చట్టవిరుద్ధం కావడంతో తొలగించాల్సి వచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్