తోపుడు బండ్ల వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గం ఎంపిక

61చూసినవారు
తోపుడు బండ్ల వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గం ఎంపిక
మండపేట తోపుడు బండ్ల వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గం ఎంపిక కార్యక్రమం స్థానిక ఏడిద రోడ్డులో గల బస్టాండ్ వద్ద మంగళవారం జరిగింది. అధ్యక్షుడిగా పుచ్చకాయల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా మామిడి వీరబాబు, కార్యదర్శిగా బెవర వీరబాబు, సహాయ కార్యదర్శిగా వాసిగాని సంతోష్ కుమార్, కోశాధికారిగా యరమాటి మంగరాజు ఎంపికయ్యారు. నూతన కార్యవర్గాన్ని మున్సిపల్ మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాశ్, టిడిపి నాయకులు సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్