శనివారం జరిగిన మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పట్టణంలోని మున్సిపల్ షాపుల్లో ఒకదాన్ని అనధికారికంగా అద్దెకు ఇచ్చి రెవిన్యూ సిబ్బంది అద్దెను జేబులో వేసుకుంటాన్నారని ఆరోపించారు. దీంతో రెవిన్యూ సిబ్బంది నీళ్లు నమిలారు. సమావేశం ముగిసిన వెంటనే ఆర్ ఐ ప్రభాకర్ హుటాహుటిన అక్కడకు వెళ్లి కలియతిరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.