యోగం, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి, మానసికంగా ప్రశాంతత పొందవచ్చని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బాబు అండ్ బాబు కన్వర్షన్ వద్ద శనివారం నిర్వహించిన యోగా ట్రయల్ రన్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. యోగా వల్ల వ్యాధులు దరిచేరవని పేర్కొన్నారు.