ఈ నెల 14న యానాంలో నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆర్ఏఓ మునిస్వామి తెలిపారు. ఈ పరీక్షకు యానాం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పరీక్షా కేంద్రంగా కేటాయించారన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. యానాం నుంచి 62 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు.