గ్రామాలలో కుక్కల స్వైర విహారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో ఆదివారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఈ దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామాల్లో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు స్పందించి వాటిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.