కాట్రేనికోన: మహిళ మెడలో గొలుసు చోరీ

84చూసినవారు
కాట్రేనికోన: మహిళ మెడలో గొలుసు చోరీ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామంలో శివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఒక అపరిచితుడు మహిళ మెడలో బంగారపు గొలుసు దొంగతనం చేశాడు. పల్సర్ వాహనంపై వచ్చిన అపరిచితుడు తన మెడలోని రెండున్నర కాసుల బంగారపు గొలుసును లాక్కొని పారిపోయాడని బాధితురాలు దీక్షితుల సీతామహాలక్ష్మి వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్