ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు ట్రేడ్ లైసెన్సు లేకుండా నిర్వహిస్తున్న నాలుగు లాడ్జీలను పరిపాలనాధికారి మునిస్వామి ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం బుదవారం తనిఖీలు నిర్వహించారు. సూర్య రెసిడెన్సీ, ఫెర్రీ స్పాట్, రివర్ రిసార్ట్, త్రీ మంకీస్ ను మూసివేసినట్లు కమిషనర్ ఖండవిల్లి రామకృష్ణ తెలిపారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లాడ్జీలలో జూదం, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు.