కాంగ్రెస్ అభ్యర్థి కారు ధ్వంసం

6869చూసినవారు
ముమ్మిడివరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పాలెపు ధర్మారావు కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాట్రేనికోన కళ్యాణి థియేటర్ వద్ద పార్కింగ్ చేసిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ధర్మారావు కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రత్యర్థులు కావాలనే తన కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ధర్మారావు కారును ఇటీవల కొనుగోలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్