కడియం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, కడియపులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. వసుంధర బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాలలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి ఆమె రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై సిబ్బందికి సూచనలు చేశారు.