ఎగువున కురుస్తున్న వర్షాలతో వృద్దగౌతమి గోదావరి పాయల్లో వరద తీవ్రత పెరుగుతోంది. ఆదివారం నాటికి కుండలేశ్వరం వద్ద పుష్కరఘాట్ వరకు నీరు చేరింది. దాంతో గోదావరి స్నానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద తీవ్రత పెరిగితే నడవపల్లిలోని పల్లిపాలెం, పల్లంకుర్రురేవు, బూలవారిమొండి తదితర చోట్ల ముంపు తీవ్రత ఉంటుంది. బూలావారిమొండి వద్ద ఏటిగట్టును వీరాస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.