ప్రధాని మోడీ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తామంటున్నారని, ఐక్యతతో దాన్ని రద్దు కాకుండా పోరాటం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు స్పష్టం చేశారు. బుధవారం ఐ. పోలవరంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కార్మికులను కలిసి సమస్యలపై చర్చించారు. ఉపాధి పనిదినాలు 200 రోజులకు పెంచాలని, కూలి రేట్లు రూ. 600కు పెంచాలని, ప్రమాదవ శాత్తు ఎవరైనా మరణిస్తే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.