ఏప్రిల్ 14వ తేదీన దేశవ్యాప్తంగా అగ్నిమాపక దినోత్సవంను పురస్కరించుకుని ముమ్మిడివరం మండలంలో అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అగ్నిమాపక ఇన్ఛార్జ్ అధికారి కొండబాబు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది వడ్డె నాగేశ్వరరావు హాజరయ్యారు.