కోనసీమ జిల్లాకు సంబంధించి ఏడు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు జరిగే చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కు హాజరయ్యే ఏజెంట్ల నుంచి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని, వారిని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో పాటు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.