ఐ. పోలవరం మండలం మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద తొమ్మిది కిలోల గంజాయిని ఐ. పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్టు చేశారు. శనివారం సమాచారం మేరకు ఎస్సై రవీంద్ర సిబ్బందితో దాడి చేసి నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.