ఐ. పోలవరం మండలం పెదమడికి చెందిన ధరణి ప్రసవం కోసం టి. కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన కొద్దిసేపటికి మృతిచెందగా, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లుగా ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఐ. పోలవరం ఎస్సై రవీంద్ర బాధితులతో మాట్లాడారు.