ఐ. పోలవరం మండలం ఎదుర్లంక పరిసర ప్రాంతంలో ఓ యువతి కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ యువతిని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సఖీ ఒన్ స్టాప్ సెంటర్ కు సభ్యులు గురువారం తరలించారు. అక్కడి నుండి ఆ మహిళను గుంటూరు జిల్లా పొన్నూరు తరలించారు. ఐసీడీఎస్ ఉద్యోగి ఈ మహిళ పరిస్థితిని సఖీ సభ్యులకు తెలపడంతో వారు బాధితురాలిని చేరదీశారు.