ఐ. పోలవరం మండలం మురమళ్ళ శ్రీభద్రకాళి సమేత వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మే 1 నుంచి 5వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ గురువారం తెలిపారు. శ్రీవిస్వావశ నామ సంవత్సరం వైశాఖ శుక్ల చవితి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశామన్నారు.