భారీ వర్షాలు, గోదావరి వరదలను ఎదుర్కొనే సన్నద్ధతపై ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాల్లో కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి బుధవారం పర్యటించారు. మొదటగా గురుజాపు లంకలోని గౌతమీ గోదావరి ఏటిగట్టును పరిశీలించారు. గురజాపులంకలో ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న పంట పొలాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. కూనలంకలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు.