కాట్రేనికోన మం. కందికుప్ప ఆర్ అండ్ బి రోడ్డు చెరువును తలపిస్తుంది. శనివారం కురిసిన వర్షం వల్ల నీరురోడ్డుపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఎక్కడ గొయ్యిందో తెలియక తికమకపడుతున్నారు. కొంతమంది వాహనాలతో బోల్తా పడుతున్నారు. వర్షం నీరు దిగే మార్గం లేక నీరు రోడ్డుపై నిలిచిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను తొలగించి రోడ్డు ముంపును నివారించాలని స్థానికులు కోరుతున్నారు.