కాట్రేనికోనకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజి టీటీడీ ఆస్థాన గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ శివైక్యం పొందిన సందర్భంగా ఆయనకు మంగళవారం చిత్రాంజలి సమర్పించారు. అంజి గీసిన చిత్రం వీక్షకులను ఆలోచింప చేస్తోంది. టీటీడీ ఆస్థాన గాయకునిగా బాలకృష్ణ ప్రసాద్ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారని అంజి పేర్కొన్నారు. ఆయన ఆలపించిన గీతాలు ఎంతోమంది ప్రముఖుల మన్ననలు పొందాయన్నారు. ఆ మహనీయుని మరణం తీరని లోటన్నారు.