అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజోలు మండలం శివకోడుకు చెందిన కూనపరెడ్డి ఎస్ఆర్వి ప్రసాద్ (రాంబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తనను నియమించిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు.