పనుల్లో నాణ్యత కొరవడితే సహించేది లేదు

67చూసినవారు
పనుల్లో నాణ్యత కొరవడితే సహించేది లేదు
యానాం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల ఎమ్మెల్యే ల్యాడ్ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడితే సహించేది లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన చెల్లే గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్