మామిడికుదురు మండలం పెదపట్నంలో కేజ్ కల్చర్ యూనిట్ ను నాబార్డ్ డీడీఎం సోము నాయుడు గురువారం పరిశీలించారు. కేజ్ కల్చర్ సాగుతో మంచి ఫలితాలు వస్తాయని, భవిష్యత్తులో చేపల పెంపకం ఈ విధానంలోనే జరుగుతుందన్నారు. గోదావరి ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుందని, దీనితో కేజ్ కల్చర్ ను మరింత అభివృద్ధి చేస్తామని నాయుడు వెల్లడించారు.