సాయం సంధ్యా వేళలో గోదావరి గలగల నడుమ ప్రకృతి సౌందర్య అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. మామిడికుదురు మండలం అప్పనపల్లి పవిత్ర వైనతేయ గోదావరి నది తీరంలో అస్తమిస్తున్న సూర్యుడు దృశ్యం ఆదివారం ఆహ్లాదాన్ని కల్గించింది. స్థానికులు సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుని మురిసిపోయారు.