వినికిడి సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన సొంత ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించడంతో పాటు వినికిడి యంత్రాన్ని సైతం సమకూర్చారు. కురసాంపేటకు చెందిన కె. సత్యనారాయణ అనే వృద్ధుడు తాను వినికిడి సమస్యతో బాధపడుతున్నానని, దీనివల్ల ఒక్కోసారి ప్రమాదాలకు సైతం గురవుతున్నానని సాయం చేయాలంటూ ఎమ్మెల్యే అశోక్ ను కోరగా ఆయన వినికిడి యంత్రాన్ని ఆదివారం బాధితుడికి అందజేశారు.