వరద బాధితులకు ఎమ్మెల్యే సహాయం

72చూసినవారు
వరద బాధితులకు ఎమ్మెల్యే సహాయం
ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల్లో బుధవారం పాల్గొన్నారు. విజయవాడ 60, 61 డివిజన్లలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ, బాధిత కుటుంబాలకు సహాయార్థం పాలు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్