ముమ్మిడివరం: తప్పుడు ప్రచారం చేయడం తగదు: ఎమ్మెల్యే

77చూసినవారు
ముమ్మిడివరం: తప్పుడు ప్రచారం చేయడం తగదు: ఎమ్మెల్యే
టీటీడీపై వైసీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి చేసిన తప్పుడు ప్రచారాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీవ్రంగా ఖండించారు. మురమళ్లలో ఆయన ఆదివారం మాట్లాడుతూ. టీటీడీలోని గోవుల మరణాలపై భూమన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ భూమన చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.

సంబంధిత పోస్ట్