ముమ్మిడివరం: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా

68చూసినవారు
ముమ్మిడివరం: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరం అనిపించిందని, అందుకే నేటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని, అంతేకానీ పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్లు. అయితే జగన్ అక్రమాలను మాత్రం కచ్చితంగా బయటకు తెస్తానని పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలోని కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు ఏబీవీ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్