క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు తెలిపారు. ఐ. పోలవరం మండలం కొమరగిరిలో జగజ్జీవన్ రామ్, అంబేడ్కర్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. 16 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో వడ్డిగూడెం విజేతగా, కొమరగిరిరన్నర్ గా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విజేతలకు ఆదివారం బహుమతులను అందించారు.