ఐ. పోలవరం మం. మురమళ్ళలోని శ్రీ వీరేశ్వరస్వామివారి నిత్యాన్నదాన ట్రస్టు కు శుక్రవారం భక్తురాలు రూ. లక్ష విరాళం అందజేశారు. కాకినాడకు చెందిన వల్లూరి సుమిత్ర రూ. లక్ష నగదును ఆలయ పర్యవేక్షణాధికారి బి. వీరభ ద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. అనంతరం దాతకు అర్చకులు దత్తుశర్మ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్ర పటాన్ని బహూకరించారు.