కాట్రేనికోన మండలం కందికుప్ప కూడలిలో ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ పగిలిపోవడంతో ట్రాఫిక్ అధికారులు మళ్లించారు. కందికుప్ప సెంటర్ లో కనకదుర్గ ఆలయం నుంచి కాలువ గట్టు మీదుగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని స్థానికులు మంగళవారం చెప్పారు. పైప్ లైన్ పనులు త్వరతగతిన పూర్తి చేసి, సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.