వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను హెల్త్ అసిస్టెంట్లు అప్రమత్తం చేయాలని కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వర రావు సూచించారు. ముమ్మిడివరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డీఎం అండ్ హెచ్ఓ దుర్గారావు దొరతో కలిసి ఆయన హెల్త్ అసిస్టెంట్లకు రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై ఆయన అవగాహన కల్పించారు.