వార్షిక మరమ్మతులు, చెట్ల కొమ్మలకత్తిరింపు పనుల నిమిత్తం ఐ. పోలవరం మండలంలోని పలు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని అమలాపురం ఈఈ మోకా రవికుమార్ గురువారం తెలిపారు. గుత్తెనదీవి, జి. వేమవరం, గోగుల్లంక, మగసానితిప్ప, పాత ఇంజరం, కేశనకుర్రు, కేశనకుర్రుపాలెం, తిల్లకుప్ప గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.