కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార, హత్య ఘటనను నిరసిస్తూ ముమ్మిడివరంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బంది శనివారం నిరశన తెలిపారు. ఆసుపత్రి నుంచి ర్యాలీగా ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టారు.దోశులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.