ఓట్ల లెక్కింపునకు 150 మందితో బందోబస్తు

83చూసినవారు
ఓట్ల లెక్కింపునకు 150 మందితో బందోబస్తు
పుదుచ్చేరి ఎంపీ అభ్యర్థి ఎన్నికకు సంబంధించి యానాంలోని సర్వే పల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మంగళవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు నిమిత్తం 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు యానాం ఎస్పీ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనేందుకు పుదుచ్చేరి నుంచి 25 మందితో ఒక పోలీసు దళం రానుందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల కాపలా ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్