ముమ్మిడివరం ఆస్థానయే బీబీజైనబీయా పీర్ల పంజా వద్ద మొహర్రంలో భాగంగా షియా ముస్లింలు షహాదత్ ను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మొహర్రం నెల ప్రారంభం నుండి నల్ల దుస్తులు ధరించి బాధాతప్త హృదయాలతో మజిలీస్ లను ఆలపించి రక్తంచిందేలా గుండెలు బాదుకుంటూ ఇమామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు మాతoను నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.