2న సామాజిక తనిఖీ ప్రజా వేదిక

74చూసినవారు
2న సామాజిక తనిఖీ ప్రజా వేదిక
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమం వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు తాళ్లరేవు ఎంపీడీఓ సీహెచ్ మోహనకృష్ణ శనివారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించి 17 గ్రామ పంచాయతీల్లోనూ 17వ విడత సామాజిక తనిఖీలు నిర్వహించామన్నారు. ఆయా గ్రామ సభల్లో వచ్చిన ఫలితాలను చర్చించేందుకు తాళ్లరేవు ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణంలో జులై 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్