ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలోని సత్తెమ్మతల్లి ఆలయం వద్ద అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడమాసంలో ఆదివారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు. జి. వెర్రిబాబు, వి. బాస్కరరావు బూరెలు, చక్కెర పొంగలి, ఎస్. కిశోర్ పులిహోర, కి. సత్యనారాయణ పాలు సమకూర్చారు.