తాళ్లరేవు మండలం పి మల్లవరం చెక్ పోస్ట్ వద్ద ఆదివారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించినట్లు కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. సిబ్బందితో వాహనాలు తనిఖీ చేసి హెల్మెట్ ధరించని వాహనదారులకు అపరాధ రుసుము విధించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించుకోవాలని ఆయన సూచించారు.