త్వరితగతిన నారుమడులు పూర్తిచేసుకోవాలి

85చూసినవారు
త్వరితగతిన నారుమడులు పూర్తిచేసుకోవాలి
ఖరీఫ్ లో స్వల్ప కాలపరిమితి విత్తనాలు ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించి రైతులు త్వరితగతిన నారుమడులను పూర్తిచేసుకోవాలని కాట్రేనికోన ఏవో ప్రవీణ్ తెలిపారు. కాట్రేనికోనలో ఆయన మంగళవారం మాట్లాడుతూ లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఆరోగ్యవంతమైన నారును 21 - 25 రోజులలో నాటుకుంటే మంచిదన్నారు. నాట్లు వేసిన ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్